ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పుట్టినరోజు మరునాడే... పొట్టన పెట్టుకున్న కరోనా! - కరోనాతో తాడ్వాయి జూనియర్‌ అసిస్టెంట్‌ విజయ మృతి

ఆమె మూడు ప్రభుత్వోద్యోగాలు పొందిన ప్రతిభాశాలి. పోటీ పరీక్షల్లో విజయాలన్నీ ఈ విజయవెంటే. జీవితంలో అన్నీ అనుకున్నట్లే జరిగాయి. మొక్కు తీర్చుకోవడానికి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది. అదే... ఆమె పాలిట మృత్యుపాశమైంది. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇంటికి చేరిన అనంతరం ఆమెకు కరోనా సోకింది. క్రమేపి విజయ ఆరోగ్య విషమిస్తూ వచ్చింది. చివరికి కన్నుమూసింది. జన్మదినం మరునాడే అనంతలోకాలకు వెళ్లిపోయింది.

government employ died with corona after birth day
government employ died with corona after birth day

By

Published : Apr 24, 2021, 7:16 PM IST

ఆమె మూడు ప్రభుత్వోద్యోగాలు పొందిన ప్రతిభాశాలి. దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి శుక్రవారం కన్నుమూశారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం పద్మజివాడికి చెందిన జాదవ్‌ విజయ(27) తాడ్వాయి తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సదాశివనగర్‌ మండలం మల్లుపేట గ్రామ పంచాయతీ జూనియర్‌ కార్యదర్శిగా రెండేళ్లు విధులు నిర్వహించారు.

తర్వాత అటవీ బీట్‌ అధికారిణిగా ఎంపికైనా ఉద్యోగంలో చేరలేదు. మూణ్నెల్ల కిందట వెలువడిన గ్రూప్స్‌ ఫలితాల్లో రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికవడంతో పంచాయతీ కార్యదర్శి పోస్టుకు రాజీనామా చేసి ఆ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం వస్తే తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకోవాలనుకుని.. పది రోజుల కిత్రమే విజయ అక్కడికి వెళ్లివచ్చారు. అనంతరం విధుల్లో చేరిన ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

నాలుగు రోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారు. గురువారం ఆమె కుటుంబసభ్యుల మధ్యే పుట్టినరోజు చేసుకున్నారు. అనంతరం పరిస్థితి విషమించగా.. నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున విజయ మరణించారు.

ఇవీ చూడండి:

ఒక్క డోసు పొందినా ఇన్‌ఫెక్షన్‌ ఉద్ధృతికి కళ్లెం!

ABOUT THE AUTHOR

...view details