ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జూన్ 12న ఈ పరీక్షను నిర్వహించారు. పేపర్-1కు 3,18,506 (90.62) మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-2ని 2,51,070 (90.35) మంది రాశారు.
TET Results Released : తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల - TET results 2022
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 90.62శాతం, పేపర్-2కు 90.35శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
టెట్ ఫలితాలు
టెట్ పేపర్-1లో 32.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. పేపర్-2లో 49.64 శాతం మంది పాస్ అయ్యారు. టెట్ పేపర్ -1లో 1,04,078 మంది అభ్యర్థులు.. పేపర్-2లో 1,24,535 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు టెట్ ఫలితాలను అధికారిక వె చూసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.. tstetresults.cgg.gov.in
ఇవీ చదవండి :