ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ వ్యాప్తంగా పది పరీక్షలు వాయిదా - telangana government decision on 10th exams

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.

తెలంగాణ వ్యాప్తంగా పది పరీక్షలు వాయిదా
తెలంగాణ వ్యాప్తంగా పది పరీక్షలు వాయిదా

By

Published : Jun 6, 2020, 9:14 PM IST

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పును అనుసరించి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్​ఎంసీలో పరీక్షలు వద్దని ఉన్నత న్యాయస్థానం సూచించింది. అయితే ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించకోవచ్చని తెలిపింది.

ఈ తీర్పుపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆ రాష్ట్ర విద్యాశాఖ.. వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడింది. ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ప్రవేశాల్లో గందరగోళం తలెత్తుతుందని ఉన్నతాధికారులు భావించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని సూచించారు. పరీక్షలు లేకుండానే గ్రేడింగ్​ ఇవ్వాలని అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్​తో జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details