ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తీన్మార్ మల్లన్న కార్యక్రమంలో ఉద్రిక్తత.. ఒకరికి గాయాలు - మల్లన్న బృందం తెరాస కార్యకర్తల మధ్య గొడవ

Tension in the Tinmar Mallanna program: మహబూబ్​నగర్​లో తీన్మార్ మల్లన్న బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమం రసాభసగా మారింది. కార్యక్రమంలో అభివృద్ధి అంశం రాగానే తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో కార్యక్రమం మల్లన్న రాకమునుపే అర్థాంతరంగా ముగిసింది.

tinmar mallanna
tension

By

Published : Sep 11, 2022, 7:45 PM IST

Tension in the Tinmar Mallanna program: తెలంగాణలో తీన్మార్ మల్లన్న బృందం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్​లో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. మల్లన్న బృందం కార్యక్రమం ప్రారంభించిన అనంతరం.. అభివృద్ధి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు తెరాస నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మల్లన్న బృందం, తెరాస వర్గం మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది.

పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఒకానొక సందర్భంలో పోలీసులు లాఠీలకు పని చెప్పి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ గొడవలో గాయపడ్డ తీన్మార్ మల్లన్న బృంద సభ్యుడిని అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. గొడవపై సమాచారం అందుకున్న మల్లన్న కార్యక్రమానికి రాకుండానే వెనుదిరిగారు.

తీన్మార్ మల్లన్న కార్యక్రమంలో ఉద్రిక్తత.. ఒకరికి గాయాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details