ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TELANGANA" 'చలో రాజ్​భవన్' ఉద్రిక్తత... పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం - revanth reddy arrested

పెట్రోల్​ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన 'చలో రాజ్‌భవన్‌' కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్తామని చెప్పి అటువైపుగా కాంగ్రెస్​ శ్రేణులు బయలుదేరాయి. అప్రమత్తమైన పోలీసులు.. ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.

'చలో రాజ్ భవన్' ఉద్రిక్తత
'చలో రాజ్ భవన్' ఉద్రిక్తత

By

Published : Jul 16, 2021, 3:12 PM IST

'చలో రాజ్ భవన్' ఉద్రిక్తత

పెట్రోల్​ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన 'చలో రాజ్‌భవన్‌' కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. రాజ్‌భవన్‌కు బయలుదేరిన కాంగ్రెస్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్‌ అందుబాటులో లేరని.. వినతిపత్రాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపాలని పోలీసులు సూచించారు. అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్తామని చెప్పి అటువైపుగా కాంగ్రెస్​ శ్రేణులు బయలుదేరాయి. అప్రమత్తమైన పోలీసులు.. ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. తోపులాటలో పలువురు పోలీసులు కిందపడిపోయారు.

అనంతరం పెద్దఎత్తున నినాదాలు చేసుకొంటూ బారికేడ్లు తోసేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలతో కాంగ్రెస్​ శ్రేణులను పోలీసులు నిలువరించేందుకు యత్నించారు. కార్యకర్తల భుజాలపైకి ఎక్కిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి.. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్లకార్డును ప్రదర్శించారు. అనంతరం కార్యకర్తల భుజాల నుంచే బారికేడ్లు దూకేశారు. అంతేవేగంగా అప్రమత్తమైన పోలీసులు.. రేవంత్​ను అరెస్ట్​ చేశారు. అయితే రేవంత్​ను తీసుకెళ్తున్న వాహనాన్ని.. కాంగ్రెస్​ శ్రేణులు అడ్డుకొనేందుకు యత్నించాయి. వారందరినీ పక్కకు నెట్టిన పోలీసులు.. టీపీసీసీ అధ్యక్షుడిని అంబర్​పేట పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇవీచూడండి: 'రష్మీ ప్రేమ కోసం వందసార్లయినా మరణిస్తా'

ABOUT THE AUTHOR

...view details