తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం (TDP central office) వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న పార్టీ కార్యాలయంపై దాడి సమయంలో అక్కడే ఉన్న పలువురు కార్యకర్తలు గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడిన కార్యకర్తలు ఇవాళ అంబులెన్స్‌లో కార్యాలయానికి వస్తుండగా.. పోలీసులు(police) అడ్డుకున్నారు.
మంగళగిరి: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత..!
15:28 October 20
పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం
చాలాసేపు రోడ్డుపైనే ఆపేశారు. వాహనం లోనికి వెళ్లేందుకు సహకరించాలని తెదేపా నేతలు ఎన్నిసార్లు విన్నవించినా.. పోలీసులు ససేమిరా అన్నారు. పోలీసుల తీరుతో.. అప్పటికే పార్టీ కార్యాలయంలో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(TDP leader lokesh) ఒక్కసారిగా రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసుల తీరును నిరసిస్తూ.. లోకేశ్, తెదేపా నేతలు రోడ్డుపై ర్యాలీ(rally)గా వెళ్లారు. ఈ సమయంలో తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం(quarreling) జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది. చివరకు.. తెదేపా నేతలు అంబులెన్స్‌ను పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం.. క్షతగాత్రులను పరామర్శించిన లోకేశ్.. కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇవీచదవండి.