.
Agnipath Agitation: సికింద్రాబాద్‌లో ఆందోళన ఉద్రిక్తం.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు - Agnipath Recruitment Scheme
13:54 June 17
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు
12:31 June 17
పలు రైల్వేస్టేషన్లలో పటిష్ఠ బందోబస్తు
10:14 June 17
పలు రైల్వేస్టేషన్లలో పటిష్ఠ బందోబస్తు
కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నిరసనకారులు గళమెత్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు... రైలుకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేస్తోంది. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌లో యువకులు చేపట్టిన ఆందోళన రణరంగంలా మారింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనలో మృతిచెందిన వ్యక్తి వరంగల్ జిల్లావాసి దామోదర్ రాకేశ్‌గా గుర్తించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కి వెళ్లి అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఆందోళనకారులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఆందోళనకారులు పోలీసులు, రైళ్లపై రాళ్లతో దాడి చేయడం వల్ల సికింద్రాబాద్ ప్రాంగణం రణరంగాన్ని తలపిస్తోంది. ఆందోళనకారులను కట్టడి చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో పలువురు యువకులు గాయపడ్డారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు.
అంతకముందు రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి... నిరసన తెలిపారు. ఒక్కసారిగా రైలు పట్టాలపై చేరి కేంద్రసర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా నియామక ప్రక్రియ కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. నిరసనకారుల నినాదాలతో రైల్వేస్టేషన్ ప్రాంగణం హోరెత్తింది.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. రైల్వేస్టేషన్‌లో లోపలికి చొచ్చుకెళ్లి ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై రాళ్లు విసిరారు. పట్టాల మధ్యలో నిప్పు పెట్టారు. దీంతో ప్రయాణికులు రైళ్లను వదిలి పరుగులు పెట్టారు. రైళ్లన్నింటినీ నిలిపివేసిన అధికారులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి వెంటనే నియామకప్రక్రియ యథాతథంగా కొనసాగించాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు సికింద్రాబాద్ అల్లర్లతో అప్రమత్తమైన రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్‌లు పోలీసు బలగాలను ఈ స్టేషన్లకి దింపాయి. ముఖ్యంగా నాంపల్లి, వరంగల్, మహబూబాబాద్, కాజీపేట, జనగామ, డోర్నకల్, రైల్వేస్టేషన్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లలో రైల్వే పోలీసులతో పాటు సాధారణ పోలీసులు కూడా మోహరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు దేశంలో ఉన్న నిరుద్యోగతకు నిదర్శనమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా విమర్శించారు. తొలుత రైతులను ఇబ్బంది పెట్టిన మోదీ సర్కార్... ఇప్పుడు సైనికులను గందరగోళ పరుస్తోందని ఆరోపించారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్- నో పెన్షన్ వరకు తీసుకొచ్చారని కేటీఆర్ దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: