నిడదవోలు గణేష్ సెంటర్లో ఉద్రిక్తత - తూర్పు గోదావరి జిల్లా తాజా వార్తలు
13:06 October 14
పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణుల యత్నం
నిడదవోలు గణేష్ సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిడదవోలు చేరుకున్న రాజధాని రైతుల మహాపాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నించింది. స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో గణేష్ సెంటర్లో వైకాపా శ్రేణులు భారీగా మోహరించాయి. పాదయాత్రను అడ్డుకునేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశించగానే గ్యోబ్యాక్ అంటూ స్థానిక వైకాపా కార్యకర్తలు, నేతలు నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వైకాపా శ్రేణుల్ని నిలువరించేందుకు పోలీసుల యత్నించారు. వర్షం వస్తుందని వైకాపా నిరసనకారులు వెనక్కి వెళ్లిపోయారు.
మరోవైపు నిడదవోలులో అమరావతి రైతుల పాదయాత్రకు నీరాజనం పట్టారు. రైతులకు మద్దతుగా నిడదవోలు రైతులు భారీగా తరలివచ్చారు. అమరావతికి మద్దతుగా 100కు పైగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులను పట్టించుకోకుండా అమరావతి రైతులు ముందుకు సాగుతున్నారు. వర్షంలోనూ పాదయాత్ర కొనసాగుతోంది.
ఇవీ చదవండి: