గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జైలు పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసుల ఆంక్షలు విధించటంతోపాటు...భారీగా బలగాలను మోహరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత.. నిరసనకారుల అరెస్ట్
రైతులకు సంకెళ్లకు నిరసనగా జైల్ భరో కార్యక్రమానికి ఐకాస పిలుపునివ్వటంతో...రాజధాని గ్రామాల ప్రజలు గుంటూరు జైలు వద్దకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పోలీసులను భారీగా మోహరించటంతో...తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత