ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడు జిల్లాల్లో మళ్లీ రెండేసి టెండర్లే...

ఎన్‌డీబీ రుణంతో చేపట్టే రహదారులు, వంతెనల పనులకు చివరి విడతగా నాలుగు జిల్లాలకు టెండర్లు పిలవగా... ఇందులో 3 జిల్లాల్లో మళ్లీ రెండేసి బిడ్లే దాఖలయ్యాయి.

Tenders for roads and bridge works in AP
మూడు జిల్లాల్లో మళ్లీ రెండేసి టెండర్లే

By

Published : Nov 29, 2020, 9:37 AM IST

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రుణంతో చేపట్టే రహదారులు, వంతెనల పనులకు చివరి విడతగా నాలుగు జిల్లాలకు టెండర్లు పిలవగా, ఇందులో 3 జిల్లాల్లో మళ్లీ రెండేసి బిడ్లే దాఖలయ్యాయి. నెల్లూరులో రూ.87.82 కోట్లు, గుంటూరు రూ.121.68 కోట్లు, విజయనగరం రూ.139.71 కోట్లు, శ్రీకాకుళంలో రూ.36.08 కోట్ల అంచనా వ్యయంతో సెప్టెంబరులో మొదటిసారి టెండర్లు పిలిచారు. ఇందులో శ్రీకాకుళం మినహా మూడు జిల్లాల్లో రెండేసి బిడ్లే రావడంతో వీటిని రద్దుచేసి మళ్లీ టెండర్లు పిలిచారు. శనివారం వాటి సాంకేతిక బిడ్లను తెరిచారు. ఇందులోనూ ఆ 3 జిల్లాల్లో రెండేసి సంస్థలే బిడ్లు వేశాయి. శ్రీకాకుళంలో గతంలో ఒకే బిడ్‌ రాగా ఈసారి 2 సంస్థలు వచ్చాయి.

* గుంటూరులో గతంలో బిడ్‌ వేసిన బీవీఎస్‌ఆర్‌తోపాటు ఈసారి హెచ్‌ఈఎస్‌ టెండర్‌ వేసింది. విజయనగరంలోనూ గతంలో బిడ్‌ వేసిన బీవీఎస్‌ఆర్‌, సుధాకర్‌ఇన్‌ఫ్రా బరిలో ఉన్నాయి. శ్రీకాకుళంలో గతంలో పృథ్వి-మూకాంబిక సంస్థలు సంయుక్త బిడ్‌ వేయగా, ఈసారి వాటితోపాటు శ్రీనివాస ఎడిఫైస్‌ టెండరు దాఖలు చేసింది. నెల్లూరులో భవానీ కన్‌స్ట్రక్షన్స్‌, కేసీవీఆర్‌ బిడ్లు వేశాయి.

గతంలో 25.. ఇప్పుడు 36

రాష్ట్రంలో మూడు విడతలుగా పిలిచిన టెండర్లలో ఏయే సంస్థలు బిడ్లు వేశాయనేది శనివారం స్పష్టత వచ్చింది. గతంలో 12 సంస్థలు 25 బిడ్లు వేశాయి. శ్రీకాకుళం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో రెండేసి బిడ్లు వచ్చాయి. ఇప్పుడు 22 సంస్థలు 36 బిడ్లు వేశాయి.

* ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలకు చెందిన బిడ్ల సాంకేతిక అర్హతల పరిశీలన పూర్తయింది. ఇందులో ఒక్కటి మినహా, మిగిలినవన్నీ అర్హత సాధించాయి.


ఇదీ చదవండి:

విశాఖ భూఅక్రమాలు...డిసెంబర్​లో సిట్ నివేదిక..!

ABOUT THE AUTHOR

...view details