అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(amrda) పరిధిలో చేపట్టే ప్రాజెక్టులకు అనుమతి, అమలుపై టెండర్ కమిటీలను పునర్నియమిస్తూ.. పురపాలక శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. సంస్కరణల్లో భాగంగా ఈపీసీ ప్రాతిపదికన రూ. పదికోట్లకు మించి చేపట్టే ప్రాజెక్టుల అమలుకు ఈ కమిటీలు పునర్నియమించినట్లు ఆమె తెలిపారు.
AMRDA: ఏఎంఆర్డీఏ పరిధిలో టెండర్ కమిటీలు పునర్నియామకం - AMRDA latest news on tender committees
అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(AMRDA) పరిధిలో చేపట్టే ప్రాజెక్టులకు అనుమతి, అమలుపై టెండర్ కమిటీలను పునర్నియమిస్తూ.. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
సాంకేతికంగా, ఆర్థికంగా వివిధ ప్రమాణాలను అనుసరించి బిడ్లను అంచనా వేయటంతో పాటు కాంట్రాక్టు గడువును పొడిగించటం వంటి అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షించనున్నాయి. ఏఎంఆర్డీఏ(amrda) అదనపు కమిషనర్.. ఛైర్మన్గా ప్రాథమిక అంశాలు, అంచనా విలువల నిర్ధరణ కోసం ఓ కమిటీ, పురపాలక శాఖ కార్యదర్శి నేతృత్వంలో టెండరు బిడ్లలోని సాంకేతిక అంశాల పర్యవేక్షణకు మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఏఎంఆర్డీఏ కమిషనర్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఏఎంఆర్డీఏ చీఫ్ ఇంజనీర్లు కమిటీల్లో సభ్యులుగా వ్యవహరించనున్నారు.