కౌలు రైతుల బలవన్మరణాలు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మేర రుణాలు ఇస్తున్నా.. అవి వారికి అందడం లేదు. ప్రభుత్వాలు భారీగా పంట రుణాలు లక్ష్యం నిర్దేశించుకుంటున్నా కర్షకునికి అందుతోంది మాత్రం అంతంతమాత్రమే. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు సైతం ఇవ్వడం లేదు. వడ్డీ సేద్యం భారమవుతోన్న వేళ.. బతకడం ఎలా అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎంఎస్పీ చట్టాన్ని తేవాలంటున్న కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జమలయ్యతో ముఖాముఖి.
'కేంద్రం ఎమ్‌ఎస్‌పీ చట్టం తేవాలి' - ఏపీలో కౌలు రైతు ఆవేదన
ఏటికేడు కౌలు రైతుల బలవన్మరణాలు పెరుగుతున్నాయని కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జమలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాలు వారికి అందడం లేదన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వడం లేదని అన్నారు. కౌలు రైతులు బతుకు భారమై ఆవేదన చెందుతున్నారని తెలిపారు.
Tenant Farmers ap President interview