Temperatures dropped in Hyderabad : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత మరింత పెరిగింది. సాయంత్రం అయిందంటే గజగజ వణికిస్తోంది. శివారు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా రికార్డవుతున్నాయి. ఆదిలాబాద్‌లో కంటే హైదరాబాద్‌లోనే రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం గమనార్హం.
శనివారం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
- పటాన్‌చెరు- 8.4 డిగ్రీలు
- రాజేంద్రనగర్- 9 డిగ్రీలు
- హయత్ నగర్- 10 డిగ్రీలు
అందుకే పెరిగింది..
ఆదిలాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.4 డిగ్రీలుగా ఉంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి శీతల గాలులు రాష్ట్రంవైపు వీస్తుండటంతో పొడి వాతావరణం ఏర్పడి... చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేశారు.
తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
- ఆదిలాబాద్- 10.6
- మెదక్- 10.8
- హనుమకొండ - 13
- హకీంపేట- 13.5
- రామగుండం- 13.4
- నిజామాబాద్- 14.1
- నల్లొండ- 15
- భద్రాచలం- 15.4
- మహబూబ్‌నగర్- 17.1
ఇదీ చదవండి:VISAKHA AGENCY BEAUTY: మన్యంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వంజంగికి పర్యాటకుల తాకిడి