Temperature in Telangana Today : రాష్ట్రంలో భానుడి భగభగలతో ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రజలు పగలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎర్రటి ఎండలో రెండు నిమిషాలు ఉండలేకపోతున్నారు. మార్చిలోనే మే నెలను తలపిస్తున్న ఎండలను చూసి ఆందోళన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మధ్యాహ్నంపూట బయటకు వస్తున్నారు.
Temperature in Telangana: తెలంగాణలో భానుడి భగభగ.. ఆదిలాబాద్లో అత్యధికం.. ఎంతంటే..
Temperature in Telangana Today : భానుడు తెలంగాణను తెగ ఉడికించేస్తున్నాడు. మార్చిలోనే మే నెలను తలపించేలా ఎండలు ఇరగకాస్తున్నాయి. ఉదయం 10 గంటలకే మధ్యాహ్నం 2 గంటలను తలపిస్తున్న ఎర్రటి ఎండ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆదివారం పగలు అత్యధికంగా జైనథ్(ఆదిలాబాద్ జిల్లా)లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో భానుడి భగభగ
ఆదివారం పగలు అత్యధికంగా జైనథ్(ఆదిలాబాద్ జిల్లా)లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణశాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. రాత్రిపూట సైతం 25 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కపోత, వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.