ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో మరో ఆరు రోజులు భగభగలే

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మరో ఆరు రోజుల పాటు భగభగలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 48డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది.

temperature
temperature

By

Published : May 22, 2020, 7:44 AM IST

ఎండలతో.. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మరో ఆరు రోజులూ ఈ భగభగలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని... కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం గుంటూరు జిల్లా భట్టిప్రోలు, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో గరిష్ఠంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.

  • ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 10 మండలాల్లో గురువారం 47 నుంచి 47.8 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 75 మండలాల్లో వడగాలులు, 140 మండలాల్లో అధిక వేడి, 437 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది.

28 వరకు ఎండలు.. తర్వాత వానలు
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతుందని, శుక్రవారం నుంచి రాయలసీమలోనూ ప్రభావం అధికంగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. ఈ నెల 28 వరకు వడగాలులు వీస్తాయని తెలిపారు. 29 నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్‌ 5 నాటికి కేరళను తాకి, కొన్నిరోజులకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు. వడగాలుల తీవ్రత పెరుగుతున్నందున జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details