ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Temparature Drops In AP: పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాష్ట్రం గజగజ - winter

Low Temperatures: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి పంజా విసురుతోంది. చలితోపాటే జలుబు, దగ్గు, ఫ్లూ తరహా జ్వరాలు వ్యాపిస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో జలుబు, దగ్గు వచ్చినా మరింత కంగారుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

temparature drop in ap
temparature drop in ap

By

Published : Dec 22, 2021, 6:36 AM IST

Updated : Dec 22, 2021, 8:35 AM IST

Weather in AP: కొద్ది రోజులుగా రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. చాలాచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతోపాటు శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హిమాలయ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మంచు గాలులు రాష్ట్రంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇక్కడి వాతావరణం బాగా చల్లబడటంతో వాయవ్య గాలుల కారణంగా ఉత్తర కోస్తా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై చలి పంజా విసురుతోంది. సంక్రాంతి వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావారణశాఖ నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల వర్షాల కారణంగా గతేడాది కన్నా ఈసారి శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు పాడేరులో 9, మినుములూరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 17న 8.4 డిగ్రీలు, 18న 6.1, 19న 5.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో చలి పెరిగింది. బుధవారం తెల్లవారుజామున 12 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. దట్టమైన పొగమంచుతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలితోపాటే జలుబు, దగ్గు, ఫ్లూ తరహా జ్వరాలు వ్యాపిస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో జలుబు, దగ్గు వచ్చినా మరింత కంగారుపడుతున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి

  • చలి సమయంలో బయటకు వెళ్తే, శరీరం మొత్తాన్ని కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాలి.
  • చర్మం పొడిబారి, పాదాలు, చేతులు పగలకుండా కొబ్బరినూనె, ఆలివ్‌నూనె వంటివి రాయాలి.
  • చలిగా ఉందని చాలామంది వ్యాయామానికి సెలవిచ్చేస్తుంటారు. ఎక్కువగా తినడం వల్ల బరువూ పెరుగుతారు. బయటకు వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే రోజుకు కనీసం ఆరగంటసేపైనా వ్యాయామం చేయాలి. గుండె జబ్బులు, మధుమేహ బాధితులకు ఇది మరింత అవసరం.
  • వేడి పానీయాలు తీసుకోవాలి. ఆహారాన్ని కూడా వేడివేడిగానే తినాలి.
  • చలిని తట్టుకునేందుకు కొందరు ధూమపానం, మద్యపానం మోతాదుకు మించి తీసుకుంటారు. దీనివల్ల గుండె స్పందన లయ తప్పి, ఒక్కోసారి ప్రాణాంతకంగా మారొచ్చు.
  • చలి తీవ్రంగా ఉన్నప్పుడు చేతులు పట్టుతప్పుతాయి. కాబట్టి రాత్రిళ్లు వాహనాలు నడపకపోవడం మంచిది.

ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి

కొవిడ్‌ లక్షణాల్లో కొన్ని చలికాలంలో సహజంగా వస్తుంటాయి. కాబట్టి వైద్యులను సంప్రదించి మందులు వాడితే మంచిది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి జ్వరాలు వస్తాయి. లక్షణాల తీవ్రతను బట్టి కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే మంచిది. అయిదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకుముందే ఆరోగ్య సమస్యలు ఉంటే.. మందులు వాడే విషయంలో వైద్యులను సంప్రదించాలి. చలితీవ్రత పెరిగినప్పుడు.. జలుబు, గొంతునొప్పి, న్యుమోనియా, ఆస్తమా, దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు, ఇతర శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతాయి. చలి తీవ్రతకు కొందరికి గుండెలోని రక్తనాళాలు కుంచించుకుపోయి.. గుండెకు రక్త సరఫరా సరిగా జరగదు. గుండె సంబంధిత వ్యాధులున్నవారు వైద్యులను ముందుగానే సంప్రదించి, సలహాలు పొందాలి. - డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, జనరల్‌ ఫిజిషియన్‌, విజయవాడ జీజీహెచ్‌

ఇదీ చదవండి:

CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్​

Last Updated : Dec 22, 2021, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details