ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలీసులకు రాబోయే రోజుల్లో తగిన మూల్యం తప్పదు' - Telugu Youth State President Shriram allegation on ysrcp news

వైకాపా ప్రభుత్వం తెదేపాలోని బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్​ (చినబాబు) ఆరోపించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపాతో వైకాపా ప్రత్యక్షంగా తలపడాలని సవాల్​ చేశారు.

Telugu Youth State President Shriram
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్

By

Published : Mar 11, 2021, 1:03 PM IST

Updated : Mar 11, 2021, 4:39 PM IST

తెదేపాలోని బీసీనేతలపై తప్పుడు కేసులు పెట్టి.. వైకాపా వేధిస్తోందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్​ (చినబాబు) ఆరోపించారు. కొల్లు రవీంద్ర అరెస్ట్ అక్రమమని.. తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. జగన్ నాయకత్వంలో దుశ్చర్యలకు పాల్పడుతున్న పోలీసులు రాబోయే రోజుల్లో తగినమూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం.. ప్రత్యక్షంగా తెదేపాతో తలపడాలని సవాల్‌ చేశారు. అప్పుడు ఎవరి సత్తా ఏమిటో, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలుతుందన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్​ ఆదేశాలతోనే పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఉంటున్నాయన్న వాస్తవాన్ని జగన్ ప్రభుత్వం గ్రహిస్తే మంచిదని హితవు పలికారు.

Last Updated : Mar 11, 2021, 4:39 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details