ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇక్కడ చిక్కుకుపోయాం.. మమ్మల్ని భారత్ తీసుకెళ్లండి'

కౌలాలంపూర్‌, మనీలా విమానాశ్రయాల్లో రెండోరోజూ తెలుగు విద్యార్థుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కరోనా దృష్ట్యా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చే విమానాలు నిలిపివేశారు. దీంతో 200 మంది విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. అధికారులు స్పందించక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.

telugu students stuck in koulalampur and maneela airports
కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

By

Published : Mar 18, 2020, 10:25 AM IST

Updated : Mar 18, 2020, 10:56 AM IST

మలేసియాలోని కౌలాలంపూర్, ఫిలిప్పీన్స్​లోని మనీలా విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల ఇబ్బందులు రెండోరోజూ కొనసాగుతున్నాయి. మనదేశానికి వచ్చే విమానాలు నిలిపివేసిన కారణంగా.. దాదాపు 200 మంది విద్యార్థులు నిన్న కౌలాలంపూర్, మనీలా విమానాశ్రయంలో ఇరుక్కున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు 50-60 రోజుల సెలవులు ప్రకటించాయి. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం సోమవారం సూచించింది. దీంతో వందలమంది తెలుగు విద్యార్థులు మంగళవారం ఉదయం మనీలా (ఫిలిప్పీన్స్‌) విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా మలేసియాలోని కౌలాలంపూర్‌ మీదుగా భారత్‌కు రావాలి. కొందరు కౌలాలంపూర్‌లో, మరికొందరు మనీలాలో చిక్కుకుపోయారు. అయితే భారత్‌ వచ్చే విమానాలన్నీ రద్దయిన కారణంగా వారంతా విమానాశ్రయంలో రోజంతా పడిగాపులు కాశారు. కౌలాలంపూర్‌లో 150 మంది, మనీలాలో 60 మంది ఇలా చిక్కుకుపోయారు. విమానాలను అనుమతిస్తున్నట్లు మంగళవారం రాత్రి కేంద్రమంత్రి ప్రకటన చేశారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా విమానాలు పంపించడం ఆలస్యమవుతోంది. దీంతో అక్కడ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆహారం సరిగ్గా అందడంలేదని వాపోతున్నారు. తమను వీలైనంత త్వరగా భారత్​కు తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు.

కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

ఇవీ చదవండి.. కరోనా ఎఫెక్ట్: విదేశాల్లో తెలుగు విద్యార్థులు విలవిల

Last Updated : Mar 18, 2020, 10:56 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details