Telugu students: వైద్యశాస్త్రం చదువుదామని ఉక్రెయిన్‌లోని జపోరిఝఝియా నగరంలో ఉన్న ‘జపోరిఝఝియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ’కి వెళ్లిన భారతీయులకు పెద్ద ఉపశమనం లభించింది. ఆ నగరంలో ఉన్న భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి కేంద్రం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. భారత రాయబార కార్యాలయ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ దేశ సరిహద్దు దాటించి హంగరీలోని బుడాపెస్ట్ విమానాశ్రయానికి చేర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు సుమారు 1500 మంది భారతీయ విద్యార్థులు విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్నారు. వారందరినీ బస్సుల్లో సమీపంలోని రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు.
Telugu students: బుడాపెస్ట్ విమానాశ్రయానికి వచ్చాక వారందరినీ విమానాల్లో భారత్‌కు తీసుకురానున్నారు. జపోరిఝఝియా నగరం నుంచి హంగరీ సరిహద్దుకు వేసిన రైలులో సుమారు వంద మంది తెలుగువారున్నారని, వీరిలో దాదాపు 10 మంది విశాఖ విద్యార్థులున్నారని సమాచారం. మరోవైపు ఉక్రెయిన్ నుంచి 17 మంది తెలుగు విద్యార్థులు మంగళవారం దిల్లీ చేరుకున్నారు. వీరిలో 11 మంది తెలంగాణ విద్యార్థులు కాగా.. ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.
విజయవాడకు విమానం నడపండి