ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై భేటీ లేదు' - తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు

అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సుల ఒప్పందం మళ్లీ వాయిదా పడింది. సోమవారం జరగాల్సిన మంత్రుల స్థాయి భేటీ లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. కొద్దిరోజులక్రితం బస్ భవన్​లో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో ఎన్ని తిరిగేవి... తెలంగాణ భూభాగంలో ఎన్ని బస్సులు తిరిగేవి అనే లెక్కలపై అధికారులు మాట్లాడుకున్నారు.

interstate rtc meeting again postponed
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై భేటీ లేదు

By

Published : Sep 13, 2020, 8:53 AM IST

తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల భేటీ మళ్లీ వాయిదా పడింది. సోమవారం జరగాల్సిన మంత్రుల స్థాయి భేటీ లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై చర్చించేందుకు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో అధికారిక భేటీపై నిర్ణయం తీసుకోలేదని అజయ్‌ స్పష్టం చేశారు. కిలోమీటర్‌ విధానంలో ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల భేటీ ఉంటుందని తెలిపారు. అధికారుల స్థాయి సమావేశాలు మాత్రం కొనసాగుతుంటాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ కంటే ఏపీ ఆర్టీసీ బస్సులు లక్షకు పైగా ఎక్కువ కిలోమీటర్లు తిరిగుతున్నాయని ఆ కిలోమీటర్లను తగ్గించుకోవాలని ఆ రాష్ట్ర అధికారుల దృష్టికి తెలంగాణ అధికారులు తీసుకెళ్లారు. కిలోమీటర్ల లెక్క తేలకపోవడం వల్​ల సమావేశం అసంపూర్తిగా మిగిలిపోయింది. తిరిగి సోమవారం ఇరు ఆర్టీసీ మంత్రులు భేటీ కావాల్సి ఉండగా... ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని.. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. కిలోమీటర్ విధానంలో అధికారుల ఒప్పందం తర్వాతే భేటీ ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టతనిచ్చారు.

ఇదీ చదవండి:కిడ్నీ కొనుగోలు పేరుతో మోసం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details