ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈనెల 17న విచారణ - విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై సుప్రీం కోర్టులో విచారణ

విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల వివాదంపై సుప్రీంకోర్టులో జరగాల్సి ఉన్న విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం వేరే కేసులో సుదీర్ఘ విచారణ కొనసాగించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈనెల 17న విచారణ
విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈనెల 17న విచారణ

By

Published : Nov 3, 2020, 9:49 PM IST

Updated : Nov 3, 2020, 10:32 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన ముగింపు నివేదికను సవాలు చేస్తూ.. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్క్ంలు, పలువురు ఏపీ ఉద్యోగులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం వేరే కేసులో సుదీర్ఘ విచారణ కొనసాగించడంతో ఈ విభజన కేసు వాయిదా పడింది.

రాష్ట్రం విడిపోయినప్పటికీ విద్యుత్‌ ఉద్యోగుల విభజన జరగకపోవడం వల్ల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సమస్య పరిష్కారం కోసం నియమించిన జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ సుమారు ఐదేళ్లుగా పలు దఫాలుగా విచారిస్తూ వస్తోంది.

ఇదీ చూడండి:రేపు ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన

Last Updated : Nov 3, 2020, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details