రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 5వ వార్షికోత్సవ సమావేశాలు ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో జరగనున్నాయి. ఈమేరకు సమాఖ్య అధ్యక్షుడు ఆర్.సుందరరావు ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖుల సందేశాలు, 9 రంగాల విశిష్ట కళాకారుల ప్రదర్శనలు, అంతర్జాతీయ కవి సమ్మేళనం ఉంటాయని అన్నారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు www.rashtretaratelugusamakhya.com వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
ఆసక్తి కలవారు నమోదు చేసుకోవాలి
తెలుగు రాష్ట్రాల వెలుపల నివసిస్తోన్న తెలుగు వారిని, తెలుగు సంస్థలను ఏకతాటిపై తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 2015లో ఏర్పడింది. 18 రాష్ట్రాల్లో సభ్యులను కలిగి ఉంది. 5వ వార్షికోత్సవానికి హాజరు కావాలనుకునే భాషాభిమానులందరూ.. https://forms.gle/oiygygxV1hmDm3j37 ద్వారా నమోదు చేసుకోవచ్చు. కరోనా సమస్యలు, ప్రభావం వంటి అంశాలను ప్రస్తావించేందుకు ఆసక్తి ఉన్న కవులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
వార్షికోత్సవ కార్యక్రమ వివరాలు ఇదీ చూడండి..
ఇళ్ల పట్టాల పంపిణీకి ఆటంకం కలగకుండా చర్యలు: మంత్రి బొత్స