విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైకాపా అన్ని విధాలుగా అవకతవకలకు పాల్పడుతోందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. విశాఖలో భాజపా, వైకాపాలు కలిసి నాటకం అడుతున్నాయని ఆరోపించారు. విశాఖకు అన్యాయం చేస్తూ.. భాజపా వేరు, కేంద్రం వేరు అంటున్నారని ఆక్షేపించారు. విశాఖలో తెదేపా గెలిస్తే అమరావతి గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. తెలుగుశక్తి విశాఖలో తెలుగుదేశానికి ఈ ఎన్నికల్లో మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
వైకాపాపై ఎస్ఈసీకి బీవీ రామ్ ఫిర్యాదు - BV Ram latest news
విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైకాపా అక్రమాలను అడుకోవాలని కోరుతూ ఎస్ఈసీకి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు చేశారు.

వైకాపాపై ఎస్ఈసీకి బీవీ రామ్ ఫిర్యాదు