సర్కారు రైతుల వద్ద సేకరించిన పంట ఉత్పత్తులకు సంబంధించిన డబ్బులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 19న అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైకాపాకు సంబంధించిన ఏజెంట్లు, మిల్లర్ల వద్ద మాత్రమే ధాన్యం సేకరిస్తున్నారన్నారని ఆరోపించారు. 3,600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని.. తక్షణమే వాటిని ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. ప్రతిపక్షాలపై ఆరోపణలు మాని.. రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.
Marreddy Srinivas reddy: 'రైతులకు తక్షణమే నగదు చెల్లించాలి' - Marreddy Srinivas Reddy latest news
రాష్ట్రప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన పంట ఉత్పత్తులకు సంబంధించిన నగదును వెంటనే చెల్లించాలని.. తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి