ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Farmer Suicide : ఉద్యోగం రాలేదు.. కాలం కరుణించలేదని.. దారుణ నిర్ణయం! - నల్గొండలో రైతు ఆత్మహత్య

Farmer Suicide : ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు ఆ యువకుడికి. ఇంతలోనే తండ్రికి అనారోగ్యం. ఇక ఉద్యోగ ప్రయత్నాలు మాని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఓవైపు అకాల వర్షాలు.. మరోవైపు తగ్గిన దిగుబడి.. ఇంకో వైపు పంట నష్టంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చలేనన్న భయంతో.. మనస్తాపం చెందిన ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా అనుముల మండలం వీర్లగడ్డ తండాలో చోటుచేసుకుంది.

telugu-news-young-farmer-committed-suicide-in-nalgonda-die-to-debts
అప్పులు తీర్చలేక యువరైతు ఆత్మహత్య

By

Published : Dec 3, 2021, 1:03 PM IST

Farmer Suicide : తెలంగాణలోని నల్గొండ జిల్లా అనుముల మండలం వీర్లగడ్డ తండాకు చెందిన బానోతు లక్ష్మణ్(22) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేట మొదలుపెట్టాడు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఇంతలోనే తండ్రికి అనారోగ్యం. జబ్బు పడిన తండ్రి వ్యవసాయం చేయలేకపోయాడు. ఇక ఉద్యోగ వేట మాని, తండ్రికి సాయంగా ఉండాలని సాగు బాటపట్టాడు లక్ష్మణ్. తమకు ఉన్న ఎకరం పొలానికి మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు.

Farmer Suicide in Nalgonda : ఓవైపు దిగుబడి సరిగ్గా లేక.. మరోవైపు అకాల వర్షాలతో పండిన ఆ కాస్త పంట కూడా నష్టపోయి లక్ష్మణ్ అప్పులపాలయ్యాడు. ఇటు సాగు చేసిన అప్పులు.. అటు తండ్రి ఆరోగ్యం కోసం చేసిన ఖర్చు అంతా కలిసి.. దాదాపు రూ.4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో అర్థంగాక.. సాగుచేసే ధైర్యం లేక.. ఉద్యోగం కూడా రాలేదన్న బాధతో లక్ష్మణ్ తీవ్ర మనస్తాపానికి గురై, మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు.

young man suicide : గమనించిన కుటుంబ సభ్యులు ఆ యువకుణ్ని నల్గొండ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తీసుకురాగా.. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం వేకువజామున మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

  • గుంటూరు మేడికొండూరు మండలం పాలడుగులో దారుణం జరిగింది. పోలీసుల వేధింపులు తాళలేక ఆనందరావు అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల రోజుల క్రితం పాలడుగు అడ్డరోడ్డు వద్ద జరిగిన సామూహిక అత్యాచారం కేసులో విచారణ పేరుతో పోలీసులు ఆనందరావుని స్టేషన్​కు పిలిపించారు. పదేపదే స్టేషన్​కు పిలిచి విచారిస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆనందరావు భార్య చెబుతున్నారు. కౌలు చేస్తున్న పొలంలోనే పురుగు మందు తాగిన ఆనందరావు అక్కడే మరణించారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులపై గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలం పెరికిపాలెేనికి చెందిన కుంకు వెంకటేశ్వర్లు అనే రైతుకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వ్యవసాయంలో లాభసాటిగా లేదని భావించిన వెంకటేశ్వర్లు.. ఉపాధి కోసం కర్ణాటక రాష్ట్రం బళ్లారి వెళ్లాడు. అక్కడ కొంత భూమి కౌలుకు తీసుకొని దానిమ్మతోట వేశాడు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. వాతావరణం అనుకూలించక పంట సరిగా రాలేదు. దీంతో వెంకటేశ్వర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు(suicide with Financial problems). పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details