ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సురేంద్రపురి ఫౌండర్ కుందా సత్యనారాయణ కన్నుమూత - temple city

Kunda Satyanarayana died: తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు సమీపంలోని సురేంద్రపురి ఫౌండర్.. కుందా సత్యనారాయణ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

కుందా సత్యనారాయణ
కుందా సత్యనారాయణ

By

Published : Jan 13, 2022, 1:22 PM IST

Kunda Satyanarayana died: తెలంగాణలోని మైథలాజికల్ టెంపుల్ సిటీ సురేంద్రపురి ఫౌండర్ కుందా సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

ఆయన ఖమ్మం జిల్లా బసవాపురంలో 1938 జూన్ 15న జన్మించారు. నలుగురు సంతానం కాగా చిన్న కుమారుడు సురేంద్రబాబు చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు సమీపంలో.. మైథలాజికల్ పార్క్ సురేంద్రపురిని నిర్మించారు. కుందా సత్యనారాయణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరపనున్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details