Power generation in Telangana :విద్యుదుత్పత్తికి సంబంధించి రెండు కేటగిరీల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. పవర్ ప్లాంట్లు మూడు విభాగాల కింద ఉంటాయి. అవి ప్రైవేటు, కేంద్రం, రాష్ట్రాల పరిధిలోనివి. కేంద్ర వాటా కొంత ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న సింగరేణి.. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్న విద్యుత్ కేంద్రాల విభాగంలో అగ్రగామిగా ఉంది. అలాగే రాష్ట్రాల వారీ జెన్‌కోలలో కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.
Electricity Production Telangana : ప్రతి థర్మల్ విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యంలో ఎంత శాతం మేర విద్యుదుత్పత్తి చేస్తున్నారనే అంశాన్ని ‘ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్’(పీఎల్‌ఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఉదాహరణకు 1,000 మెగావాట్ల సామర్థ్యంతో స్థాపించిన ఒక కేంద్రం గరిష్ఠంగా 800 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే.. పీఎల్‌ఎఫ్ 80 శాతంగా ప్రకటిస్తారు. దీని ఆధారంగా ప్రతి నెలా అన్ని ప్లాంట్లకు, రాష్ట్రాలకు కేంద్రం ర్యాంకులిస్తుంది. రాష్ట్రాల యాజమాన్యాల పరిధిలో ఉన్న విద్యుత్ కేంద్రాల పీఎల్‌ఎఫ్ ర్యాంకుల జాబితాలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో ఏప్రిల్ నుంచి నవంబరు వరకూ 8 నెలల కాలానికి 86.75 శాతం పీఎల్‌ఎఫ్‌తో సింగరేణి దేశంలోనే అగ్రస్థానం పొందగా.. 74.20 శాతంతో తెలంగాణ రెండో, పశ్చిమ బెంగాల్ 69.45 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి.
8 నెలల్లో 1,584 కోట్ల యూనిట్ల ఉత్పత్తి