ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Car fell into well in siddipet: బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి!

Car fell into well in siddipet: రహదారి పక్కన ఉన్న ఓ బావిలో కారు అదుపుతప్పి పడిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కారును వెలికితీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ ఘోరప్రమాదం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చిట్టాపూర్​లో జరిగింది.

Car fell into well in siddipet
సిద్దిపేట జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు

By

Published : Dec 1, 2021, 5:00 PM IST

Car fell into well in siddipet: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద విషాదం నెలకొంది. సిద్దిపేటకు వెళ్లే ప్రధాని రహదారి పక్కన ఓ కారు అదుపు తప్పి బావిలో పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బావిలో నుంచి కారును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మోటార్లతో బావిలోని నీటిని ఖాళీ చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు... సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.

రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కన చిట్టాపూర్ భూంపల్లి గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన ఉన్న బావిలో ఓ కారు అదుపు తప్పి పడిపోయింది. ప్రమాదం జరిగిన కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారో సమాచారం లేదు. బావిలో నుంచి నీరు పూర్తిగా తోడేస్తే గానీ... ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. బావి లోతు సుమారు పదిహేను నుంచి ఇరవై గజాలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్​రావు... నీటిని తోడే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

ఇదీ చదవండి:SI Attack on Wife at Court: కోర్టు ఆవరణలో భార్య, అత్తమామలపై ఎస్ఐ​ దాడి..

ABOUT THE AUTHOR

...view details