ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భాజపా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4 వరకు తెలుగు భాషా వారోత్సవాలు' - BJP leader vishnukumar raju

తెలుగు ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భాజపా ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 4 వరకు భాషా వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. తెలుగు దండు' సంస్ధ ఆధ్వర్యంలో విశాఖ మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

By

Published : Aug 29, 2021, 11:15 AM IST

Updated : Aug 29, 2021, 3:45 PM IST

తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 4 వరకు తెలుగుభాషా వారోత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. తెలుగుభాష విశిష్టత - ప్రాశస్త్యంపై ప్రసంగాలు, వ్యాసరచన పోటీలు ఉంటాయని తెలిపారు.

తెలుగును సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారు: ఎమ్మెల్సీ మాధవ్

జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాతృభాష తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు మాధవ్ మండిపడ్డారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కడపలో అన్నమయ్య విగ్రహనికి పూలమాలవేసి అక్కడ నుంచి ర్యాలీగా హరిత హోటల్ వరకు చేరుకున్నారు. చెక్క భజనలు, డప్పు వాయిద్యాలతో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. చిన్నారులు తెలుగుతల్లి వేషధారణతో అలరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో తెలుగు దినోత్సవాన్ని భాజపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

తెలుగు ఔన్నత్యాన్ని కాపాడాలి: విష్ణుకుమార్ రాజు

'తెలుగు దండు' సంస్ధ ఆధ్వర్యంలో విశాఖ మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద వ్యవహారిక భాషా ఉద్యమ సారధి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు హాజరయ్యారు. రాష్ట్రంలో తెలుగు భాష కనుమరుగు కాకుండా భాషా, సాహితీవేత్తల సహకారంతో భాజపా వారోత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. తెలుగు ఔన్నత్యాన్ని కాపాడి, అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇదీ చదవండి:

'కృష్ణా జలాలపై జగన్, మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు'

Last Updated : Aug 29, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details