సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై జాతీయ మనవ హక్కుల కమిషన్కు తెలుగుదేశం పార్టీ నేతలు ఫరూక్, నాగుల్ మీరా, నజీర్ అహ్మద్, పర్వీన్ తాజ్లు విడివిడిగా లేఖలు రాశారు. ఏపీలో పోలీసుల దమనకాండ పెరిగిపోయిందని ఆరోపించారు. అధికార వైకాపా నాయకులతో ఓ వర్గం పోలీసులు కుమ్మకై దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇద్దరు పిల్లలతో సహా ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయం చెయ్యాలని కోరారు.
సామూహిక ఆత్మహత్య ఘటన... ఎన్హెచ్ఆర్సీకి తెదేపా లేఖలు
నంద్యాలకు చెందిన కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై జాతీయ మనవ హక్కుల కమిషన్కు తెదేపా నేతలు లేఖలు రాశారు. ఏపీలో పోలీసుల దమనకాండ పెరిగిపోయిందని ఆరోపించారు. ఆత్మహత్యకు కారకులైన పోలీసు అధికారులకు బెయిల్ రావడం వెనుక అధికార పార్టీ పాత్ర ఉందని తమ ఫిర్యాదుల్లో నేతలు పేర్కొన్నారు.
ఎన్హెచ్ఆర్సీకి తెదేపా లేఖలు
రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీల పరిస్థితి దయనీయంగా మారిందన్న తెదేపా నేతలు... ముస్లింలపై అనేక దాడులు జరుగుతున్నా ఎక్కడా న్యాయం జరగట్లేదని మండిపడ్డారు. 14 ఏళ్ల కుమార్తె, 7 ఏళ్ల కుమారుడితో కలిసి కుటుంబం ఆత్మహత్య చేసుకోవటం ద్వారా బాలల హక్కులు ఏ విధంగా హరిస్తున్నారో తెలుస్తోందన్నారు. ఆత్మహత్యకు కారకులైన పోలీసు అధికారులకు బెయిల్ రావడం వెనుక అధికార పార్టీ పాత్ర ఉందని తమ తమ ఫిర్యాదుల్లో నేతలు పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... ఎమ్మెల్యేల ఆగడాలను ఆపేదెవరు..?