పాఠశాల విద్యలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోను సమంజసం కాదని తెలుగు భాష పరిరక్షణ సమితి అభిప్రాయపడింది. మాతృభాష ప్రేమికులను, తెలుగుభాషా పరిరక్షణ సమితి సభ్యులను, ఉపాధ్యాయులను ఈ నిర్ణయం తీవ్రంగా కలచివేసిందని చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో తెలుగు భాషపై తీవ్ర ప్రభావం చూపుతుందని మండిపడింది.
''తెలుగులో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతం అవుతుంది. విద్యార్థుల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం తప్పు. పొరుగు రాష్ట్రాలు మాతృభాషను తప్పనిసరిగా అమలు చేస్తుంటే... మన రాష్ట్రంలో మాత్రం అటకనెక్కించారు. ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించండి'' అంటూ లేఖలో తెలుగు భాష పరిరక్షణ సమితి పేర్కొంది.