తెలుగు అకాడమీ బ్యాంకు ఖాతాలో ఉన్న నిధుల్లో ఆంధ్రప్రదేశ్ వాటాను రెండు వారాల్లో బదిలీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అకాడమీకి సంబంధించిన స్థిర, చరాస్తుల పంపకాల వ్యవహారంపై తెలంగాణ దాఖలు చేసిన కేసు మంగళవారం సుప్రీంకోర్టులో జస్టిస్ డీఐచంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీనాగరత్నల ధర్మాసనం విచారణ చేపట్టింది. చరాస్తులు, బ్యాంకుల్లోని నిల్వల అంశాలను పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు స్పందిస్తూ బ్యాంకుల్లోని నిధులను 2 వారాల్లోపు ఏపీ ఖాతాకు బదిలీ చేస్తామని విన్నవించారు.
2 వారాల్లో తెలుగు అకాడమీ నిధుల వాటా - ap latest news
తెలుగు అకాడమీ బ్యాంకుల్లోని నిధులను 2 వారాల్లోపు ఏపీ ఖాతాకు బదిలీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
2 వారాల్లో తెలుగు అకాడమీ నిధుల వాటా