ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఓటు వేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు - mlc elections updates

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. ఆయా పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వరంగల్‌ జిల్లా వేలేరులో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఓటేయగా... నర్సంపేటలో యువ తెలంగాణ అభ్యర్థి రాణిరుద్రమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

telengana mlc candidates casted their votes
ఓటు వేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు

By

Published : Mar 14, 2021, 11:04 AM IST

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని తార్నాకలో భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెలవు రోజు ఎన్నికలు ఎర్పాటు చేసినందుకు ఎలక్షన్ కమిషన్​కు కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్​లో పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు.

వరంగల్‌ జిల్లా వేలేరులో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఓటేయగా... నర్సంపేటలో యువ తెలంగాణ అభ్యర్థి రాణిరుద్రమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఓటేశారు.

ఇదీ చూడండి: కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు .. వెలువడుతున్న ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details