తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. అదృశ్యం, వ్యభిచారానికి సంబంధించిన 8 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై న్యాయస్థానం విచారణ జరిపింది. చిన్నారుల ఆచూకీ కోసం సాంకేతికత వినియోగించాలని సూచించింది. ముఖ కవళికలు గుర్తించే పరిజ్ఞానం వాడాలని పేర్కొనగా.. రాష్ట్రంలో దర్పన్ కార్యక్రమం అమలవుతోందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తెచ్చారు.
చిన్నారుల అదృశ్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ - telangana varthalu
తెలంగాణలో చిన్నారుల అదృశ్యం, వ్యభిచారానికి సంబంధించిన 8 పిల్స్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటులో జాప్యంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
చిన్నారుల అదృశ్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ
అదృశ్యం వివరాలను అన్ని రాష్ట్రాలతో పంచుకోవాలన్న హైకోర్టు.. కేంద్రాన్ని సుమోటో ప్రతివాదిగా చేర్చింది. కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. 2 వారాల్లోగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చిన్నారుల అదృశ్యం కేసు విచారణ ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు.. తెదేపా మేనిఫెస్టో విడుదల