ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీహెచ్‌సీల్లో టెలీ మెడిసిన్ వైద్య సేవలు విస్తృతం - పీహెచ్‌సీల్లో టెలీమెడిసిన్ వైద్య సేవల వార్తలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సేవలు విస్తృతమయ్యాయి. జనరల్ ఫిజీషియన్, గైనిక్, చిన్నపిల్లల వైద్య నిపుణుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ, విజయవాడ, తిరుపతిలోని బోధనాసుపత్రుల్లో హబ్‌లను ఏర్పాటు చేసి.. రాష్ట్రంలోని 650 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేశారు.

tele-medicine-in-ap
tele-medicine-in-ap

By

Published : Dec 17, 2019, 6:06 PM IST

పీహెచ్‌సీల్లో టెలీమెడిసిన్ వైద్య సేవలు విస్తృతం

నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం టెలీమెడిసిన్ సేవలను అందిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసి గ్రామీణ ప్రజలకు వైద్యసేవలందిస్తున్నారు. జిల్లాకు 50 చొప్పున ఎంపిక చేసిన 650 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించారు. మిగిలిన కేంద్రాల్లోనూ వచ్చే జనవరి నెలాఖరునాటికి టెలీ మెడిసిన్ వైద్య సేవలు ప్రారంభించనున్నారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు చేస్తోన్న హెల్త్ అండ్ వెల్‌నెస్ పథకం కింద ప్రస్తుతం 3 హబ్‌ల ద్వారా... ఈ సేవలు అందిస్తున్నారు. ప్రతి జిల్లాలోని బోధనాసుపత్రిలో ఒక్కొక్క హబ్ ఏర్పాటు చేసి, టెలీ మెడిసిన్ వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విశాఖ హబ్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. విజయవాడ హబ్ పరిధిలోకి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను తీసుకువచ్చారు. తిరుపతి హబ్ పరిధిలో నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను చేర్చారు.

రోగులను పరీక్షించే పీహెచ్‌సీ వైద్యాధికారులు సమస్య తీవ్రత ఆధారంగా హబ్‌లోని నిపుణులను సంప్రదిస్తారు. పరీక్షల నివేదికలను వారికి పంపడం ద్వారా.. వాటిని పరిశీలించిన వైద్యులు రోగులతో మాట్లాడి వైద్య సలహాలు అందిస్తున్నారు. టెలీ మెడిసిన్ ద్వారా నవంబరు 7 నుంచి డిసెంబరు 10 వరకు 6వేల 422 మంది వైద్య సేవలు పొందారని వైద్యులు చెబుతున్నారు. హబ్ నిర్వహణలో అప్పుడప్పుడు తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

డివిలియర్స్ జట్టులోకి వస్తే బాగుండు: డుప్లెసిస్​

ABOUT THE AUTHOR

...view details