కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ తరఫున ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ అక్రమంగా జలాలు తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి లేని ప్రాజెక్టుల ద్వారా తరలింపు అడ్డుకోవాలని కోరారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి తరలింపు ఆపాలని లేఖలో పేర్కొన్నారు. మాల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటి తరలింపు ఆపాలని విజ్ఞప్తి చేశారు. బనకచర్ల రెగ్యులేటర్ నుంచి నీటి తరలింపును కుడా ఆపాలని ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు.
Telangana: కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ - కృష్ణా బోర్డు వార్తలు
కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఏపీ అక్రమంగా జలాలు తరలించకుండా చూడాలంటూ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి తరలింపు ఆపాలని పేర్కొన్నారు.
కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు లేఖ
ఆగస్టు 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు హైదరాబాద్ జలసౌధలో ఉమ్మడిగా అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ దృష్ట్యా సమావేశానికి హాజరుకావడం కుదరదని ముందే తెలిపిన తెలంగాణ ప్రభుత్వం భేటీకి గైర్హాజరైంది.
ఇదీ చదవండి: Amit Shah: శ్రీశైలం మల్లన్న సన్నిధికి కుటుంబ సమేతంగా అమిత్ షా