ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 29, 2021, 4:53 PM IST

ETV Bharat / city

Telangana Weather Report: రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు

రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో ఒకట్రెండు ప్రదేశాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం తెలంగాణ నుంచి దూరం వెళ్లిపోయిందని తెలిపింది.

Telangana Weather
వర్షాలు

తెలంగాణలో.. రానున్న మూడ్రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిపోయిందని ప్రకటించింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నాయని తెలిపారు.

తీవ్ర అల్పపీడనం బంగ్లాదేశ్ పరిసర పశ్చిమ బంగాల్ ప్రాంతాల మీదుగా స్థిరంగా సాగుతోందని అధికారులు చెప్పారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపోస్పీయార్ వరకు స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. రాగల 48 గంటల్లో ఇది పశ్చిమ దిశగా కదులుతూ పశ్చిమ బంగాల్, ఝూర్ఘండ్, బిహార్ మీదుగా వెళ్లే అవకాశాలున్నాయని ఐఎండీ సంచాలకులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details