ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS WEATHER: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో పలుచోట్ల వర్షాలు - telangana weather report TODAY

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ఫలితంగా ఇవాళ, రేపు అనేకచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.

rains
తెలంగాణలో వర్షాలు

By

Published : Sep 6, 2021, 3:44 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెండు, మూడు రోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు అనేకచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

నిన్న మరట్వాడ పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని హైదరాాబాద్‌ వాతారవణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల ద్రోణి ఈరోజు బికనూర్, జయపుర, గుణా, సియోని, గొందియా, గోపాల్ పూర్, వాయువ్య పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలోని అల్పపీడనం మీదగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని తెలిపారు.

షియర్ జోన్ ఈ రోజు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 7.6 కిలో మీటర్ల మధ్య కొనసాగుతూ... ఎత్తుకు వెళ్లే కొద్దీ... దక్షిణ దిశగా వంపు తిరిగనుందని తెలిపారు. దీనితో వాయువ్య , తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మీదగా కొనసాగుతోందని ఐఎండీ సంచాలకులు వివరించారు.

ఇదీ చూడండి: LIVE UPDATES: మీర్‌పేట్​లో ప్రజల ఇబ్బందులు..ఇళ్లలోకి చేరిన మురుగు నీరు

ABOUT THE AUTHOR

...view details