ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB MEETING: జల విద్యుదుత్పత్తిలో ఛైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అసంతృప్తి..వాకౌట్​ - AMARAVATI NEWS

తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న కృష్ణా జలాల వివాదంపై చర్చించేందుకు కేఆర్ఎంబీ ఏర్పాటు చేసిన సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. నీటిని సమాన నిష్పత్తిలో పంపిణీ చేయాలని తెలంగాణ తరఫున అధికారి విజ్ఞప్తి చేశారు. అనవసరంగా తెలంగాణపై ఏపీ ప్రభుత్వం నిందలు వేస్తోందని అన్నారు.

KRMB MEETING
KRMB MEETING

By

Published : Sep 1, 2021, 8:24 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణిపై జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు (krishna river board management meeting-krmb) సమావేశం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాకౌట్‌ చేసింది. ఐదుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన సమావేశం ముగిసింది. జల విద్యుదుత్పత్తి విషయంలో ఛైర్మన్ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. సాగర్, కృష్ణా డెల్టా (krishna delta) అవసరాలకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి ఉండాలన్న ఛైర్మన్‌ నిర్ణయాన్ని కేసీఆర్ సర్కారు తప్పుపట్టింది. కేఆర్ఎంబీ సమావేశం ముగిసిన అనంతరం... కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం ప్రారంభమయ్యాయి. గెజిట్ నోటిఫికేషన్ (gazette notification) అమలు కార్యాచరణపై చర్చిస్తున్నాయి. ఉమ్మడి సమావేశానికి తెలంగాణ, ఏపీ అధికారులు హాజరయ్యారు.

సమాన నిష్పత్తిలోనే..

కృష్ణా బోర్డు సమావేశంలో వాదనలు వినిపించిన తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ నీటిని సమాన నిష్పత్తిలో పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ జలసౌధలో కేఆర్‌ఎంబీ ఛైర్మన్ ఎం.పి.సింగ్ (KRMB CHAIRMAN MP SINGH) అధ్యక్షతన జరిగిన సమావేశానికి... ఏపీ, తెలంగాణ అధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. కృష్ణా జలాల పంపిణీ, శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి, గోదావరి జలాల మళ్లింపు సహా.. 13 అంశాలపై వారు చర్చించారు.

తెలంగాణపై నిందలు..

ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు.... తాత్కాలికమన్న రజత్ కుమార్ అవి కేవలం 2015-16 ఏడాదికి వర్తించేలా అంగీకారం కుదిరిందన్నారు. ఎస్​ఎల్​బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు పూర్తైనందున నీటి వినియోగం పెరిగిందని వివరించారు. సమాన నిష్పత్తిలో నీటి పంపిణీ విషయంలో రాజీపడేది లేదన్న రజత్‌కుమార్‌ సమాన వాటాపై కేఆర్​ఎంబీ ఛైర్మన్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపే ప్రసక్తే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కావాలనే అన్ని విషయాల్లోనూ కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. కృష్ణా బేసిన్ (Krishna river basin) పరిధిలో లేని ప్రాంతాలకు నీటిని తరలిస్తూ తెలంగాణపై నిందలు వేస్తోందన్నారు. రాయలసీమ ప్రాజెక్టుపై (RAYALASEEMA LIFT IRRIGATION PROJECT) కేఆర్​ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

తెలంగాణ విజ్ఞప్తిపై ఏపీ అభ్యంతరం..

భౌగోళిక స్వరూపం దృష్ట్యా ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగునీరు ఇవ్వాల్సిఉందని, వ్యవసాయ బోరుబావులకు కూడా విద్యుత్‌ ఉత్పత్తి కావాలని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కోసమే నిర్మించిన ప్రాజెక్టు అన్న తెలంగాణ అధికారులు ... జలవిద్యుత్‌ ఉత్పత్తి అత్యవసరమని స్పష్టం చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అభ్యంతరం తెలిపారు. దిగువన సాగునీటి అవసరాలు లేనప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే తమకు నష్టం జరుగుతుందని వివరించారు.

ఇదీ చదవండి:

Bharat Biotech CMD: సింపుల్ థింకింగ్ అలవాటుతోనే సమస్యలకు పరిష్కారం: కృష్ణా ఎల్లా

ABOUT THE AUTHOR

...view details