ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: 44వ జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు మృతి - Telangana: Two died in accident on National Highway 44

జడ్చర్ల మండలంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై.. బురెడ్డిపల్లి మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు కారును ఢీ కొట్టారు. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Telangana: Two died in accident on National Highway 44
తెలంగాణ: 44వ జాతీయ రహదారిపై ప్రమాదం-ఇద్దరు మృతి

By

Published : Aug 11, 2020, 9:56 PM IST

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు కారును ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్ద జరిగింది. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన యువకుడిని మహబూబ్​నగర్​ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details