ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'థియేటర్లలో సగం సీట్లు నిండినా సంతోషమే' - థియేటర్ల యాజమానుల సమస్యలు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్​లాక్ 5.oలో భాగంగా అక్టోబర్​ 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని థియేటర్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విషయాలను వెల్లడించారు ఆ సంఘం ప్రతినిధులు. మరోవైపు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో.. రారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

telangana-theaters-association
telangana-theaters-association

By

Published : Oct 3, 2020, 5:17 PM IST

మీడియాతో తెలంగాణ థియేటర్ల సంఘం ప్రతినిధులు

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆరు నెలల నుంచి హాళ్లు మూతపడటంతో తీవ్రంగా నష్టపోయామని తెలంగాణ థియేటర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుచుకోనున్న క్రమంలో.... సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకులకు కొవిడ్‌ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రేక్షకులు ఎవరూ టికెట్లు తాకకుండా చర్యలు చేపడతామని, విరామ సమయంలో ప్రేక్షకులు గుమిగూడకుండా జాగ్రత్త వహిస్తామని అన్నారు. శానిటైజర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్​లో సంఘ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకుంటేనే సినీ థియేటర్ల పరిశ్రమ బతికి బట్టకడుతుంది. ఆదాయం రాని కారణంగా... సినిమా థియేటర్ల కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో‌ సినిమా హాళ్లు తెరిచేందుకు అనుమతించాలి. ప్రభుత్వం అనుమతించినా థియేటర్స్‌కు రావడానికి ప్రేక్షకులెవ్వరూ అంతగా ఆసక్తి చూపరు. కనీసం సగం సీట్లు నిండినా సంతోషమే

- తెలంగాణ థియేటర్ల సంఘం ప్రతినిధులు

ఇవీచూడండి:

'తెర'లేస్తోన్న వినోదం.. జనాలు ఇంతకు ముందులా వస్తారా?

ABOUT THE AUTHOR

...view details