టాక్సీ యజమానులు, డ్రైవర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కోరారు. తెలంగాణ టాక్సీ డ్రైవర్ల ఐకాస పవన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చింది. టాక్సీ యజమానులు, డ్రైవర్లు కరోనాతోపాటు వరదలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. టాక్సీలకు 6నెలల పాటు పన్నులు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. టాక్సీ ఉందనే కారణంగా తెల్ల రేషన్ కార్డు తొలగించటం సరికాదని అభిప్రాయపడ్డారు. లక్షన్నర కుటుంబాల జీవనాధారమైన రంగాన్ని నిలబెట్టాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
టాక్సీ యజమానులు, డ్రైవర్లను ఆదుకోవాలి: పవన్
టాక్సీ యజమానులు, డ్రైవర్లను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్‌కల్యాణ్ కోరారు. లక్షన్నర కుటుంబాల జీవనాధారమైన రంగాన్ని నిలబెట్టాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
పవన్