Holiday: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రేపు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ.. ర్యాలీలు, జెండా ప్రదర్శనలతో రాష్ట్రం త్రివర్ణ శోభితమైంది. జై తెలంగాణ నినాదాలతో మారుమోగుతోంది. వజ్రోత్సవాల వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని పలువురు నేతలు పేర్కొంటున్నారు.
రేపు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం - telangana state government has announced a holiday
Tomorrow Holiday: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ.. ర్యాలీలు, జెండా ప్రదర్శనలతో రాష్ట్రం త్రివర్ణ శోభితమైంది. జై తెలంగాణ నినాదాలతో మారుమోగుతోంది.
ts logo
ఇవీ చదవండి: