ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రాజెక్టుల్లో అవినీతిపై కేంద్ర మంత్రికి బండి సంజయ్​ ఫిర్యాదు - తెలంగాణ భాజపా తాజా వార్తలు

తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న దోపిడిని అడ్డుకోవాలంటూ కేంద్రమంత్రి జావడేకర్‌ను బండి సంజయ్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యాలయంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.

bandi sanjay Complaint to Union Minister Javadekar
కేంద్ర మంత్రికి బండి సంజయ్​ ఫిర్యాదు

By

Published : Feb 13, 2021, 6:08 PM IST

తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల ప్రజాధనం ప్రైవేటు వ్యక్తుల పాలవుతోందని.. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. ఆ దుర్వినియోగాన్ని ఆపాలని కేంద్ర మంత్రి జావడేకర్​ను కోరారు. రాష్ట్రంలో మరిన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరముందని, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి తాము సహకరిస్తామని బండి సంజయ్ కేంద్రమంత్రికి స్పష్టం చేశారు.

డీపీఆర్​లు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించకపోవడం, కేంద్ర జలశక్తిశాఖ అనుమతి లేకుండానే ప్రాజెక్టులు ప్రారంభించడం వెనుక అవినీతి దాగుందని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ విధంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కావడమే కాకుండా...ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యక్తుల పాలవుతోందని కేంద్ర మంత్రికి వివరించారు. నిబంధనల్లో తేవాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో చర్చించి... నిర్ణయం తీసుకుంటానని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు బండి సంజయ్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details