ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల - ts ssc results

పదో తరగతి ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. పరీక్ష రుసుము చెల్లించిన 5,21,393 మందిని ఉత్తీర్ణులు చేసి గ్రేడ్లను ఖరారు చేసింది ప్రభుత్వ పరీక్షల విభాగం.

telangana
తెలంగాణలో పదోతరగతి ఫలితాలు

By

Published : May 21, 2021, 10:10 AM IST

తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లను నేడు వెల్లడించనున్నారు. ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. సుమారు సగం మంది విద్యార్థులకు 10 జీపీఏ దక్కినట్లు తెలుస్తోంది.

కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా తుది మార్కులు కేటాయించి గ్రేడ్లు ఖరారు చేయాలని ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పరీక్ష రుసుము చెల్లించిన 5 లక్షల 21 వేల 393 మందిని ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తీర్ణులు చేసి గ్రేడ్లను ఖరారు చేసింది. గతేడాది రెండు ఎఫ్ఏ పరీక్షల ఆధారంగా గ్రేడ్లను నిర్ణయించారు. గతేడాది 5 లక్షల 34 వేల మంది విద్యార్థుల్లో లక్ష 41 వేల 382 మందికి పది జీపీఏ దక్కింది.

ABOUT THE AUTHOR

...view details