తెలంగాణలో పదో తరగతి పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది ఆరు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ పరీక్షలు జరుపుతామని అధికారులు వెల్లడించారు.
పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 25 వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చింది. 50 రూపాయల ఆలస్య రుసుముతో మార్చి 3 వరకు, 200 రూపాయల ఆలస్య రుసుముతో మార్చి 12 వరకు, 500రూపాయల ఆలస్య రుసుముతో మార్చి 16 వరకు గడువు ఇచ్చింది.