ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: సారూ…. మా ఇళ్లను తొలగించొద్దు… - telangana sir please do not remove our home

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో ఎస్కేఎన్ఆర్ కళాశాల సమీపంలో మున్సిపల్‌ అధికారులు ఆక్రమణలు తొలగిస్తుండగా ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. షెడ్లను తొలగిస్తుండగా తమ ఇంటిని తొలగించవద్దంటూ ఇద్దరు యువకులు అడ్డుకుని... ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు.

telangana sir please do not remove our home
తెలంగాణ: సారూ…. మా ఇళ్లను తొలగించొద్దు…

By

Published : Jun 23, 2020, 9:17 PM IST

తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని ఎస్​కేఎన్​ఆర్ కళాశాల సమీపంలో మున్సిపల్‌ అధికారులు ఆక్రమణలు తొలగిస్తుండగా ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ అక్రమంగా నిర్మించిన షెడ్లను అధికారులు తొలగించారు. వాటిలో ఉన్న ఇద్దరు యువకులు... తమకు నివాసం లేదని, మా ఇంటిని తొలగించవద్దంటూ అడ్డుకున్నారు.

ఒంటిపై పెట్రోలు పోసుకుని నిరసన తెలిపారు. పోలీసులకు, యువకులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం సాగింది. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details