తెలంగాణ రాష్ట్రం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగారెడ్డి... ఇటీవలే కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత కాలికి ఇన్‌ఫెక్షన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు.
ఆయన 2004, 2008లో దొమ్మాట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యే నుంచి గెలిచిన సోలిపేట.. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హరీశ్‌రావు, పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేశారు. సోలిపేట రామలింగారెడ్డికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోలిపేట రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం. ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి చిట్టాపూర్‌కు తరలించారు.