తెలంగాణలో కొత్తగా 753 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,68,418కి పెరిగింది. తాజాగా 952 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకూ 2,56,330 మంది ఆరోగ్యవంతులుగా కోలుకున్నారు. మరో ముగ్గురు మృతి చెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,451కి చేరుకుంది.
తెలంగాణలో కొత్తగా 753 కొవిడ్ కేసులు..ముగ్గురు మృతి - covid 19 death stats telangana
తెలంగాణలో మూడు రోజులుగా కరోనా కేసులు తక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 753 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముగ్గురు మరణించారు.
కరోనా కేసులు
జీహెచ్‌ఎంసీ పరిధిలో 133 కేసులు నమోదవగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 78, రంగారెడ్డిలో 71 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి :తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే