ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా - Telangana: rapidly expanding corona in hyderabad

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గురువారం మరో 662 మందికి కొవిడ్ సోకింది. శివారుల్లో వైరస్ బాగా విస్తరిస్తోంది. సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్ వైద్యుడు(70) కరోనాతో చికిత్స పొందుతూ అదే ఆస్పత్రిలో గురువారం మృతి చెందడం విషాదాన్ని నింపింది.

Telangana: rapidly expanding corona in hyderabad
తెలంగాణ: భాగ్యనగరంలో వేగంగా విస్తరిస్తోన్న కరోనా

By

Published : Jul 24, 2020, 4:37 PM IST

తెలంగాణలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ నలువైపులా కరోనా విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల నుంచి కేసులు నమోదవుతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మహమ్మారి సోకే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా గ్రేటర్‌లో గురువారం 662 మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు. గాంధీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 9 మంది బాధితులను కరోనా కబళించింది. రంగారెడ్డి జిల్లాలో 213 మంది, మేడ్చల్‌లో 33 మందిలో వైరస్‌ గుర్తించారు. తాజాగా శివారుల్లో వైరస్‌ బాగా విస్తరిస్తోంది. ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, ఉప్పల్‌, కాప్రా, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ తదితర సర్కిళ్ల పరిధిలో కేసులు భారీగా వెలుగుచూస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.

కార్పొరేట్‌ ఆసుపత్రి వైద్యుడి మృతి

సోమాజిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్‌ వైద్యుడు(70) కరోనాతో చికిత్స పొందుతూ అదే ఆస్పత్రిలో గురువారం మృతి చెందడం విషాదాన్ని నింపింది. 20 ఏళ్లుగా ఆయన అక్కడ సేవలందిస్తున్నారు. కరోనా బాధితుల తాకిడితో బిజీగా ఉన్న ఆయన 20 రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు.

ఇదీ చదవండి:రోడ్ల మీదే ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోరా..?: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details